వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర స్వామి అనుబంధ భీమేశ్వ‌రాల‌య ఆదాయానికి గండి

by Ratna Kumari |

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన భీమేశ్వర ఆలయం ముందు ఉన్న లడ్డు కౌంటర్ వద్ద దర్జాగా భక్తుల వద్ద నుంచి బిక్షాటన చేసే వాళ్లు దాదాపు పది మందికి పైగా క్యారీ బ్యాగులు సొమ్ము చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర స్వామి అనుబంధ భీమేశ్వ‌రాల‌య ఆదాయానికి గండి
X

దిశ, వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన భీమేశ్వర ఆలయం ముందు ఉన్న లడ్డు కౌంటర్ వద్ద దర్జాగా భక్తుల వద్ద నుంచి బిక్షాటన చేసే వాళ్లు దాదాపు పది మందికి పైగా క్యారీ బ్యాగులు సొమ్ము చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయానికి వచ్చే వేలది మంది భక్తులు ప్రసాదాలు తీసుకొని వెళుతున్న సందర్భంలో క్యారీ బ్యాగులు ప్రైవేట్ వ్యక్తులు ఇష్టాను రీతిగా ఎవరికి భయపడేది లేదు అని అమ్ముతున్నారు. మమ్మల్ని హోంగార్డ్స్ ఎస్పీఎఫ్ సిబ్బంది అమ్ముకోమన్నారు అని చెప్తున్నారు మహిళలు వాళ్లకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి అమ్ముకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల వద్ద చాలా నిలువు దోపిడీ చేస్తున్నరు భక్తులు వాపోతున్నారు ఆలయ అధికారులు ఎస్పీఎఫ్ హోంగార్ సిబ్బంది నిర్లక్ష్యం వాళ్లనే ఇలా జరుగుతుంది అని భక్తులు చెబుతున్నారు.ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని దేవస్థానం వాళ్లే ఆలయ సమాచారాన్ని ముద్రించి తిరుపతి దేవస్థానం లాగా, దేవస్థానం ఒక కౌంటర్ ఏర్పాటు చేసి వ్యక్తిని కూర్చోబెట్టి ప్రైవేట్ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Next Story