- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజన్న కోడెలకు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోడెల వరుస మృత్యువాత సంఘటనకు సంబంధించి తాజా పరిస్థితులను, కోడెల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ వెలువడింది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.

దిశ, వేములవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోడెల వరుస మృత్యువాత సంఘటనకు సంబంధించి తాజా పరిస్థితులను, కోడెల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ వెలువడింది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. తిప్పాపూర్ లో గోశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న మరో 3 కోడెలు మరణించాయని, 6 కోడెల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అకాల వర్షాలు అనారోగ్య పరిస్థితుల కారణంగా తిప్పాపూర్ లోని గోశాలలో మొదట 8 కోడెలు మరణించగా జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై 5 వెటర్నరీ డాక్టర్లతో కూడిన 12 మంది వైద్య బృందం ఏర్పాటు చేసి గోశాలలోని పశువులను పరిశీలించినట్లు తెలిపారు.
రెండవ రోజు అనారోగ్య కారణంతో మరో 5 కోడెలు మరణించాయనీ, అనారోగ్యం పాలైన 20 పశువులను ప్రత్యేకంగా చికిత్స అందించి వాటిలో 16 పశువుల ప్రాణాలు రక్షించామని, రెండవ రోజు మరో 4 కోడెలు మరణించాయని అన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం వరకు మరో 3 కోడెలు మరణించాయని, గోశాలలో ఉన్న 1300 పశువులలో మరో 4 కోడెలు అనారోగ్యం పాలయ్యాయని, ప్రస్తుతం మొత్తం 16 పశువులు అనారోగ్యంతో బాధపడుతున్నాయని, వీటిలో 6 కోడెల పరిస్థితి విషమంగా ఉందని, వీటిని బ్రతికించేందుకు వెటర్నరీ డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారని, అవసరమైన ఫ్లుయిడ్స్, మందులు అందిస్తున్నారని, వైద్యులు అందించే చికిత్సకు ఆ కోడెలు స్పందించడం లేదనీ అన్నారు.
గోశాలలో మొత్తం 20 కోడెలు అనారోగ్య పరిస్థితులతో మరణించాయని, ప్రస్తుతం 16 కోడెల అనారోగ్యంతో ఉన్నాయని, 5 వెటర్నరీ వైద్యుల బృందం గోశాలలో ఉండి సేవలు అందిస్తున్నారని , మిగిలిన కోడెలు ఆరోగ్యంగా ఉన్నాయని అన్నారు. పచ్చగడ్డి సరఫరా కాంట్రాక్టర్ తో చర్చలు జరిపి రోజు సరఫరా చేసే ఒక ట్రాక్టర్ గడ్డికి బదులు, నేటి నుంచి రెగ్యులర్ గా రోజు 10 టన్నుల (5 ట్రాక్టర్) గడ్డి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను రాజన్న స్వామి భక్తులు నమ్మవద్దని, కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.






