- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారుల కొరడా
వేములవాడ పట్టణ పరిధిలో అక్రమంగా వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లపై మున్సిపల్ అధికారులు కొరడా జూలిపించారు.

దిశ, వేములవాడ : వేములవాడ పట్టణ పరిధిలో అక్రమంగా వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లపై మున్సిపల్ అధికారులు కొరడా జూలిపించారు. వేములవాడలో విచ్చలవడిగా వెలుస్తున్న అక్రమ వెంచర్లపై గత కొద్ది రోజుల క్రితం దిశ పత్రిక "రియల్ వ్యాపారుల మాస్టర్ ప్లాన్" పేరిట ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన మున్సిపల్ అధికారులు గురువారం పట్టణ పరిధిలోని అయ్యోరుపల్లి శివారుతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న అక్రమ వెంచర్ల హద్దు రాళ్లను టి. పి.బి.ఓ వినోద్ ఆధ్వర్యంలో తొలగించారు.
అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దు: అన్వేష్, మున్సిపల్ కమిషనర్
అనుమతులు లేకుండా వెలసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దు. ఇలా అనుమతులు లేని వాటిలో కొనుగోలు చేసిన స్థలాన్ని అభివృద్ధి చేసుకునే సమయంలో అనుమతుల మంజూరులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని అనుమతులతో ఏర్పాటుచేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రియల్ వ్యాపారులు సైతం నిబంధనల మేరకు, అనుమతులన్నీ తీసుకున్న తర్వాతే వెంచర్లు ఏర్పాటు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే వెంచర్లను తొలగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది.






