- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక రిజర్వేషన్లపై వేములవాడ అధికార పార్టీ నాయకుల అసంతృప్తి...?
స్థానిక రిజర్వేషన్లపై వేములవాడ అధికార పార్టీ నాయకుల అసంతృప్తి గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వేములవాడ: స్థానిక రిజర్వేషన్లపై వేములవాడ అధికార పార్టీ నాయకుల అసంతృప్తి గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో వేములవాడ నియోజకవర్గానికి చెందిన ఆశావాహులు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో పార్టీ టికెట్లపై గంపెడు ఆశలతో ఎదురు చూసి చివరికి రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన మరికొంత మంది సీనియర్ నాయకులు మాత్రం మరో పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. తమకు అనుకూలంగా లేని చోట రిజర్వేషన్లను మార్పు చేయించే ప్రక్రియ కొరకు కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో ప్రతిపక్ష పార్టీల నాయకుల కంటే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం వేములవాడ రూరల్ లోని అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజా ప్రజా ప్రతినిధి ఒకరు.... కొంతమంది పార్టీ ముఖ్య నాయకులతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితులైన మరికొంత మంది వ్యక్తులతో సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎలాగైనా ఈ రిజర్వేషన్లను మార్పించాలని చర్చించినట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్ని కాకపోయినా కనీసం తాను పోటీ చేయాలనుకున్న స్థానంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలోని మరో మండలానికి సంబంధించిన జడ్పీటీసీ రిజర్వేషన్లను మార్చేలా చూడాలని చర్చలు చేస్తున్నారట.
అయినప్పటికీ పని కాకుంటే చివరికి కోర్టు మెట్లు ఎక్కి అయినా సరే తమకు అనుకూలమైన రిజర్వేషన్లను పొందుదామని తోటి నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రహస్య సమావేశం వేములవాడలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా ఇతర మండలాల్లో సైతం మరికొంత మంది అధికార పార్టీ నాయకులు ఇదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశంపై ఏమి జరుగుతుందో...వేచి చూడాలి మరి.






