కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టాలి

by velandi.Saikiran |

బీఆర్ నాయుడును వెలిచాల రాజేందర్‌రావు బుధవారం సాయంత్రం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు.

కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టాలి
X

దిశ, కొత్తపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడును కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్‌రావు బుధవారం సాయంత్రం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణం.. అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. కరీంనగర్ నగరంలోని టీటీడీ ఆలయాన్ని భక్తులకు సౌకర్యవంతంగా నిర్మించేందుకు అవసరమైన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల విస్తరణ, భక్తుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం, అదనపు సదుపాయాల కల్పన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆలయ ప్రాంగణం అభివృద్ధి, పార్కింగ్ సదుపాయాల విస్తరణ, పరిశుభ్రత నిర్వహణ, తాగునీటి వసతి, భక్తులకు మెరుగైన దర్శన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, ఆలయ పరిసరాల సుందరీకరణ వంటి అంశాలపై సానుకూలంగా చర్చ జరిగింది.

కరీంనగర్ టీటీడీ ఆలయాన్ని ఉత్తర తెలంగాణ ప్రాంత భక్తులకు మరింత చేరువ చేసే విధంగా నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేయగా, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు వెలిచాల రాజేందర్‌రావు తెలిపారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ తరఫున ప్రత్యేక కృషి చొరవ చూపుతామని పేర్కొన్నారని చెప్పారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ యాజమాన్యం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ టీటీడీ ఆలయం ఆధ్యాత్మికతకు ప్రధాన పాత్ర పోషిస్తుందనీ, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిర్మాణం చేపట్టేలా నిరంతరం తమ వంతు కృషి చేస్తామని వెలిచాల రాజేందర్‌రావు స్పష్టం చేశారు. కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి.. అభివృద్ధికి సానుకూలంగా స్పందించిన బి.ఆర్ నాయుడుకి వెలిచాల రాజేందర్రావు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story