- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా అభిమానుల ర్యాలీని ప్రారంభించిన వెలిచాల
హైదరాబాద్ తరలి వెళ్లే వాహనాల ర్యాలీని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో దేవక్కపల్లిలో రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు

దిశ, కరీంనగర్ టౌన్ : సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి మరిన్ని మంచి సినిమాలు తీస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాదులో జరిగే వేడుకలకు కరీంనగర్ జిల్లా నుంచి చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్ ఆధ్వర్యంలో 400 మంది మెగా అభిమానులు తరలి వెళ్లారు.
హైదరాబాద్ తరలి వెళ్లే వాహనాల ర్యాలీని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో దేవక్కపల్లిలో వెలిచాల రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం అని పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేక ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు అని, గతంలో తమ ఇంట్లో కరీంనగర్లో ఐదు రోజులపాటు ఉన్నారని గుర్తు చేశారు. చిరంజీవితో అనుబంధం ఉండడం అదృష్టం అన్నారు. చిరంజీవి విలక్షణమైన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారని తెలిపారు.
చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని మెగా అభిమానులు.. చిరంజీవి యువత ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. యువత చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో వందలాది మంది చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు తరలి వెళ్లడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వేల్పుల వెంకటేష్ ను రాజేందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్, ఆకుల నరసన్న, ఆకుల ఉదయ్ బట్టు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






