సర్పంచ్ పదవీకి వేలం వేసిన వీడీసీలు

by Nallavelli.Anjaneyulu |

దిశ, మెట్ పల్లి : రాజ్యాంగ బద్దంగా నిర్వహించాల్సిన ఎన్నికలను వేలం పాటలు నిరహిస్తున్నారని జ‌గ్గ‌సాగ‌ర్ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు రద్దు చేయాలని వాదించినందుకే గ్రామ వీడీసీలు తమను

సర్పంచ్ పదవీకి వేలం వేసిన వీడీసీలు
X

దిశ, మెట్ పల్లి : రాజ్యాంగ బద్దంగా నిర్వహించాల్సిన ఎన్నికలను వేలం పాటలు నిరహిస్తున్నారని జ‌గ్గ‌సాగ‌ర్ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు రద్దు చేయాలని వాదించినందుకే గ్రామ వీడీసీలు తమను గ్రామ బహిష్కరణ చేశార‌ని ఆరోపిస్తూ మెట్ పల్లి పోలీస్ లకు పిర్యాదు చేశారు. గ్రామ బహిష్కరణ కు గురైన బాధితుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీసీ రిజర్వేషన్ వ‌చ్చింది. అయితే గ్రామ వీడీసీ లు సర్పంచ్ పదవీ ని (గురటి కాపు) ఓసీల మైన మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సర్పంచ్ పదవీ కి వేలం పాటలు నిరహించగా.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సుమారు రూ.28.60 లక్షలకు దక్కించుకున్నాడని మంగళవారం ఉప సర్పంచ్ పదవీతో పాటు, వార్డ్ సభ్యుల పదవులను సైతం వేలం పాటలు నిర్వహింస్తున్నారు. అడ్డుకొని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ వేలం పాటలు నిర్వహణను అడ్డుకున్నందుకు గ్రామ బహిష్కరణ చేసారని తెలిపారు. వారితో ఎవ్వరు మాట్లాడొద్దని, కిరణం షాప్ లో నిత్యావసర వస్తువులు, డాక్టర్లు, మీ సేవాలలో సైతం ఎలాంటి పనులు చేయరాదని, అలాగే వేలం పాటలో వచ్చిన డబ్బులు మాకు దక్కవని హుకుం జారీ చేశారని ఆరోపించారు. దీంతో సరిపెట్టుకోకుండా జగ్గాసాగర్ గ్రామ శివారులోని వరద కాలువ కొరకు సేకరించగా మిగిలిన ప్రభుత్వ భూమిని చాలా సంవత్సరాల నుంచి గ్రామంలోని పశువుల కొరకు గ్రామస్తులంతా వాడుకుంటున్నామని ఇప్పుడు ఆ మిగిలిన ప్రభుత్వ భూమిని సైతం గ్రామ వీడీసీలు సంఘాల వారిగా పంచుకోని స్వంతం చేసుకోవాలని కోరగా దానికి మేము వ్యతిరేకంగా, ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడం ఏంటని గ్రామ వీడీసీలను నిలదీయ‌గా.. భూమి పంపకాలను అండుకున్న మమ్మల్ని ప్రధాన వీడీసీ లు కొందరు గ్రామ బహిష్కరణ చేసి వేదిస్తున్నారని ఆరోపిస్తూ మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి, ఎన్నికలు అధికారికి దృష్టికి సైతం తీసుకెళ్ళ నున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో గురటి కాపు సంఘ సభ్యులు ఉన్నారు.

Next Story