గ్రామాలను శాసిస్తున్న వీడీసీలు...

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ గ్రామం శాంతి భద్రతలకు విరుద్దంగా అక్రమ కార్యకలాపాలకు తెరలేపేలా వ్యవహరిస్తుంది.

గ్రామాలను శాసిస్తున్న వీడీసీలు...
X

దిశ, ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ గ్రామం శాంతి భద్రతలకు విరుద్దంగా అక్రమ కార్యకలాపాలకు తెరలేపేలా వ్యవహరిస్తుంది. విధ్వంసం, అక్రమ వ్యాపారాలకు, దాడులు ప్రతి దాడులకు కేంద్ర బిందువుగా మారింది. వాటికీ తోడు వీడీసీలు గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్ధి మంచి ఏదో, చెడు ఏదో చెప్పాల్సిందిపోయి అక్రమంగా బెల్ట్ షాప్ కు వేలం పాటలు నిర్హహించారు. వివరాల్లోకి వెళ్ళితే.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన గోదావరి నది తీరానికి అనుకుని ఉన్న ఓ గ్రామం గత కొద్దీ సంవత్సరాల నుండి దాడులు, అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యాకలాపాలకు కేంద్ర బిందువుగా మారిందనడానికి నిదర్శనమే మంగళవారం జరిగిన బెల్ట్ షాపు అక్రమ వేలం పాటల నిర్వాకం. గ్రామానికి చెందిన వీడిసీలు గత కొద్దీ సంవత్సరాల నుండి ఆనవాయితీగా కొనసాగుతున్న బెల్ట్ షాప్, చికెన్, కూల్ డ్రింక్‌లకు వేలం పాటలు నిర్వహించి అనాదికరంగా అనుమతులు ఇస్తూ వస్తున్న క్రమంలో తాజాగా మంగళవారం గ్రామంలోని బెల్ట్ షాప్ కు వేలం పాటలు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 4లక్షలకు బెల్ట్ షాప్ లను వేలం పాటలో దక్కించుకుని ప్రింట్ రేట్ కన్నా అదనంగా 20రూపాయలు ఎక్కువకు అమ్ముతూ ప్రజల జేబులకు చిల్లులు పెడ్తూ యేథేచ్చగా మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నారు. అయితే ఇదే బాటలో మరికొన్ని గ్రామాలు ఇదే బాటలో వేలం పాటలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ విధాత్తం ఇలాగే కొనసాగితే శాంతి భద్రతలకు విగతాం కలుగుందని పలువురు ఆరోపిస్తున్నారు.

అధికారుల అవగాహనా సదస్సులను కాలరాస్తున్న వీడీసీలు...

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అధికారులు గంజాయి, మాదఖ ద్రవ్యలు, డ్రింక్ అండ్ డ్రైవింగ్, గంజాయి, లాంటి వాటికీ యువత దూరంగా ఉండాలని గ్రామ గ్రామాన అవగాహన సదస్సులను నిర్వహిస్తు ప్రజలను చైతన్యవంతంగా చేయాలనీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటే, గ్రామాలను శాసిస్తున్న వీడీసిలు మాత్రం వాటికీ భిన్నంగా వ్యవహరిస్తూ గ్రామాల అభివృద్ధి పేరుతో అక్రమంగ వేలం పాటలు నిర్వహించి, అధికారులను, ప్రభుత్వాన్ని తప్పు తోవా పట్టిస్తూ యాథేచ్చగా గ్రామాల్లో సమంతర ప్రభుత్వాన్ని నడిపిస్తూ అనాదికాలంగా అనుమతులు ఇస్తున్నారు.

బైండోవర్లు లేకే బరితెగింపులు...

ఏదైనా అక్రమ కార్యక్రమలకు పాల్పడిన వారిని గతంలో స్థానిక తహసీల్దార్ ముందు ఒకటి, రెండు సార్లు బైండోవరు చేసేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి బైండోవర్లు లేకపోవడంతో వీడీసీలతో అధికారులు కుమ్మక్కయ్యరా...? లేక మరేదైనా కారణమే కానీ బైండోవరు చేసే వారు లేకనే వీడీసీలు బరితెగించి అక్రమ కార్యకలాపాలు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికికైనా జిల్లా అధికారులు స్పందించి గ్రామాల్లో అక్రమంగా వేలం పాటలు నిర్వహిస్తున్న వీడీసీలను గుర్తించి అశాంతి భద్రతలను కాపాడి వీడీసీలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

Next Story