- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ కూలీల పాలిట శాపంగా మారిన వీబీ - బీరామ్ జీ పథకం
కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి నూతనంగా తీసుకువచ్చిన 'వీబీ- జీరామ్ జీ' చట్టం ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దిశ, గొల్లపల్లి : కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి నూతనంగా తీసుకువచ్చిన 'వీబీ- జీరామ్ జీ' చట్టం ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో గత 30 ఏళ్లుగా ఇళ్ల పై నుంచి వెళ్తున్న కరెంట్ వైర్లతో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే సమస్యను పరిష్కరించినట్లు లక్ష్మణ్ కుమార్ వివరించారు. తాను మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా వారంలో మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
అనంతరం ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా తెచ్చిన వీబీ- జీరామ్ జీ పథకంలో ఐరిస్ పద్దతిలో కూలీల హాజరు నమోదు చేయడంతో చాలా మంది పేర్లు నమోదు కావడం లేదని, దీనివలన ఉపాధి కోసం వచ్చిన కూలీలకు పని దొరకడం లేదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యను రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లానని, కేంద్ర ప్రభుత్వం కూడా వీబీ- జీరామ్ జీ చట్టంను మరోసారి సమీక్షించి నిబంధనలు సడలించి ఉపాధి కూలీలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు.






