- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా కొరకు తిప్పలు..అధికారుల తీరుపై ఆగ్రహం
by velandi.Saikiran |
మంథనిలో యూరియా కోరకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంథనిలో ఫర్టిలైజర్, స

X
దిశ, మంథని : మంథనిలో యూరియా కోరకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంథనిలో ఫర్టిలైజర్, సొసైటీ వద్ద యూరియా కోరకు రైతులు, మహిళలు క్యూ లైన్ లో పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గురువారం మంథని లోని పవన్ సాయి ఎరువుల దుకాణం వద్ద రైతులు, మహిళలు యూరియా కొరకు బారులు తీరారు. ఒక్కో రైతుకు ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పడంతో....అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఫర్టిలైజర్ షాప్ యజమానులు యూరియాను ఎక్కువ ధరకు పక్క మండలాలకు బ్లాక్ లో అమ్ముకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా తమకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






