- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదపు అంచున ఎగువ మానేరు
ఎగువ మానేరు ప్రాజెక్టు ప్రమాదపు అంచునకు చేరిందని జిల్లా ఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

X
దిశ, గంభీరావుపేట : అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఎగువ మానేరు ప్రాజెక్టు ప్రమాదపు అంచునకు చేరిందని జిల్లా ఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో సగానికి పైగా పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. అలాగే ఆప్రాన్ పూర్తిగా దెబ్బతినడం, గొలుసుకట్టు కాలువలు శిథిలావస్థకు చేరడం, తూముల సట్టర్లు తుప్పు పట్టి పనిచేయని స్థితిలో ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏవైనా అనర్థాలు జరిగితే వాటికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Next Story






