- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్ 14 లోపు విగ్రహాలను ఆవిష్కరించండి..!
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో గత మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ విగ్రహాలకున్న ముసుగులను తొలగించి ఏప్రిల్ 14 లోపు ఆవిష్కరించాలని తిమ్మాపూర్ మండలంలోని దళిత బహుజన నాయకులు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో గత మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ విగ్రహాలకున్న ముసుగులను తొలగించి ఏప్రిల్ 14 లోపు ఆవిష్కరించాలని తిమ్మాపూర్ మండలంలోని దళిత బహుజన నాయకులు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119 వ జయంతి సందర్బంగా దళిత సంఘాల గౌరవ అధ్యక్షుడు కనకం రాములు ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రం లోని అంబేద్కర్ భవన్ లో జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మాతంగి లక్ష్మణ్, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు , మాజీ సర్పంచ్ మేడి అంజయ్య, బీసీ సంఘ నాయకుడు సుగుర్తి జగదీశ్వరాచారి లు మాట్లాడుతూ సమాజం లోని అన్నీ వర్గాల మధ్య సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు పోరాడిన బాబు జగ్జీవన్ రాం గొప్ప నాయకుడని కొనియాడారు.
మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రాం, అంబేద్కర్ విగ్రహాలకున్న ముసుగులను తొలగించకుండా నిర్లక్ష్యం వహించడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. విగ్రహాలకున్న ముసుగులను వెంటనే తొలగించి ఆవిష్కరించకపోతే మండలంలోని దళిత బహుజన నాయకులు, ప్రజల ఆగ్రహన్ని చూస్తారని హెచ్చరించారు. మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించాలని గత మూడేళ్లుగా చేయని కార్యక్రమాలు లేవన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ లను కూడా కలిశామని ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్టీసీ అధికారుల బేషజాల చర్యలతో విగ్రహాలు నెలకొల్పిన ఆవరణ చెత్త, చెదారంతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా అటువైపు వెళ్లకుండా కేసులు పెడతామని బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. సహనం కోల్పోయిన రోజున ఏ చట్టం కూడా తమను ఆపలేదని.. అందుకే వెంటనే విగ్రహాల ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పషమైన ప్రకటన చేయాలని లేదంటే దళిత బహుజన ప్రజల ఆగ్రహన్ని చవిచూస్తారని హెచ్చరించారు. వివిధ పార్టీలకు చెందిన దళిత బహుజన నాయకులు,మాజీ సర్పంచ్ ఊపులేటి ఉమారాణి, మాజీ ఎంపిటీసి కవ్వంపల్లి పద్మ, మాతంగి శంకర్, వంతడ్పుల సంపత్, కన్నం లక్ష్మణ్, సంగుపట్ల మల్లేశం, కొయ్యడ మురళి, కొమ్ము సంపత్, బోయిని సంపత్, సముద్రాల లక్ష్మణ్, కన్నం నర్సయ్య, తాళ్లపల్లి సంపత్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, సుగుణాకర్ పాల్గొన్నారు.






