అంటరానితనానికి సమాజంలో స్థానం లేదు

by Nallavelli.Anjaneyulu |

మండలంలోని నాగిరెడ్డిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గునుకొండ యశోద అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

అంటరానితనానికి సమాజంలో స్థానం లేదు
X

దిశ, గంగాధర : మండలంలోని నాగిరెడ్డిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గునుకొండ యశోద అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ తహశీల్దార్ కళావతి ముఖ్య అతిథిగా హాజరై పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ కళావతి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం.. అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించి నిర్మూలించినట్లు తెలిపారు.


సమాజంలో ప్రతి పౌరుడు సమాన హక్కులు కలిగి ఉంటారని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావాలతో అందరూ కలసి మెలసి జీవించాలని సూచించారు. పౌరులు చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి వాటికి అనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరైనా ఇలాంటి వివక్షకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, ఉపాధి హామీ ప్రాజెక్టు అధికారులు, పోలీస్ సిబ్బంది, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ సెక్రటరీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు ప్రవీణ్, శ్రీనివాస్, సురేష్, రాజయ్య, మాజీ సర్పంచ్ కర్ర విద్యాసాగర్ రెడ్డి, గునుకొండ బాబు పాల్గొన్నారు.

Next Story