ఆకాల వ‌ర్షం రైత‌న్న‌లు ఆగం.. త‌డిసి ముద్ద‌యిన 200 ఏక‌రాల ధాన్యం..

by Bhanu |   (  Updated:2025-05-14 10:04:59  IST  )

ఆకాల వ‌ర్షం రైత‌న్న‌లు ఆగం.. త‌డిసి ముద్ద‌యిన 200 ఏక‌రాల ధాన్యం..
X

దిశ‌,ఏటూరునాగారం : ఆరుగాలం క‌ష్టించిన రైత‌న్న‌ల క‌ష్టాన్ని ఆకాల వ‌ర్షం ఆగం చేసింది. ఆకాల వ‌ర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలోని వాగు ఉప్పోంగడంతో కొనుగోలు కేంద్రంలో అర‌బోసిన ధాన్యం, రాశులు పోసిన ధాన్యం రైతుల క‌ళ్ల ముందే వ‌ర్షం కార‌ణంగా వ‌చ్చిన వ‌ర‌దలో కొట్ట‌కుపోయింది. ఖాంటాలు పెట్టిన ధాన్యం బ‌స్తాలు వ‌ర‌ద నీటిలో త‌డిసి ముద్ద‌వుతున్న ఏమి చేయ‌లేని ప‌రిస్థితిలో రైతులు క‌న్నీటి ప‌ర్యంత‌మైన ఘ‌ట‌న ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం గోగుప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మండ‌లంలోని గోగుపెల్లి గ్రామ శివారులో రైతులు ఏర్పాటు చేసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రంను స‌మీపంలోని ఊర‌వాగు రాత్రి కురిసిన ఆకాల వ‌ర్షంతో ఉప్పోంగి ధాన్యం కొనుగోలు కేంద్రంను ముంచేత్తిది. ఈ ఘ‌ట‌న‌తో ధాన్యం కొనుగోలు కేంద్రంలో 45 మంది రైతులు ఆర‌బోసుకున్న సుమారు 200 ఏక‌రాల ధాన్యం వాగు వ‌ర‌ద ఉదృతితో కొట్టుకుపోయింది. ఖాంటాలు పెట్టిన సుమారు 150 బ‌స్తాల ధాన్యం త‌డిసి ముద్ద‌యింది. అంతే కాకుండా లోడింగ్ కు సిద్దంగా ఉన్న ధాన్యం బ‌స్తాలు మిల్ల‌ర్లు క్వింటాకు 10 కీలోలు త‌రుగు తీయాల‌న‌డంతో కొనుగోలు కేంద్రంలోనే ఉంచామ‌ని వ‌ర‌ద తాకిడికి అ బ‌స్తాలు కూడా త‌డిసి ముద్దయ్యాయ‌ని రైతులు క‌న్నీటి ప‌ర్య‌మంత‌వుతున్నారు. రైతులకు జ‌రిగిన న‌ష్టాన్ని స‌ర్వే చేసి న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్రభుత్వం అదుకోవాల‌ని రైతులు వేడుకుంటున్నారు.

క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్న రైతులు

అప్పులు తీసుకోచ్చి పెట్టుబడుల పెట్టి పంట‌లు సాగు చేశామ‌ని అకాల వ‌ర్షాలు త‌మ‌ని అగం చేస్తున్నాయ‌ని రైతులు గోగుప‌ల్లి రైతులు అవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చేతికొచ్చే స‌మ‌యంలో ధాన్యం వ‌ర‌ద‌లో కొట్టుకుపోయింద‌ని రైతులు క‌న్నీటి ప‌ర్యంత‌మవుతున్నారు. గోగుప‌ల్లి గ్రామం పూర్తి స్థాయిలో వ‌రి పంట సాగు చేసే గ్రామం అని ఇక్క‌డి రైతులంద‌రూ వ‌రి పంట త‌మ ప్ర‌ధాన జీవ‌నాద‌రంగా జీవిస్తుంటుర‌ని అలాంటి గ్రామ రైతులను అకాల వ‌ర్షం తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చింద‌ని ఇప్పుడు త‌మ‌కు ఏమి చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని, చేసి అప్పులు ఏలా తీర్చాలో తెల‌య‌డం లేద‌ని రైతులు క‌న్నీరు పెట్టుకుంటున్నారు.

న‌ష్ట‌పోయిన రైతుల‌ను అదుకోవాలి: బీఆర్ఏస్ మాజీ జ‌డ్పీ చైర్మైన్‌

అకాల వ‌ర్షం తో వ‌చ్చిన వ‌ర‌ద కార‌ణంగా త‌డిసి ముద్ద‌యిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ములుగు జిల్లా బీఆర్ఏస్ పార్టీ మాజీ జ‌డ్పీ చైర్మైన్‌, బీఆర్ఏస్ పార్టీ నియోజ‌క వ‌ర్గ ఇన్చార్జీ బ‌డే నాగ‌జ్యోతి సంద‌ర్శించి జ‌రిగిన న‌ష్టాన్ని ప‌రిశీలించి రైతుల‌తో వాటిల్లిన‌ న‌ష్టం గురించి అరా తీశారు. ఈ సంద‌ర్బంగా మాజీ జ‌డ్పీ చైర్మైన్ బ‌డే నాగ‌జ్యోతి మాట్ల‌డుతూ..స‌రైన స‌మ‌యంలో వ‌డ్ల‌ను కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతోనే అకాల వ‌ర్షాన బారీన ప‌డి ధాన్యం త‌డిసి ముద్ద‌యిందని త‌డిసి ముద్ద‌యిన ధాన్యంను వెంట‌నే ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు.అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్లు, వడ్ల బస్తాలు వరదల్లో కొట్టుకపోవడంతో దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా అని అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతు లేనిదే రాజ్యం లేద‌ని అలాంటి రైతుల‌ను ఇబ్బందులు పెట్టుకుంటే మీకు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని ఆమె హెచ్చ‌రించారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వ‌డ్డ‌ను ఎందుకు కొనుగోలు చేస్త‌లేరో చేప్పాల‌ని మీ నిర్ల‌క్ష్యం కార‌ణంగా రైతులు న‌ష్టాలపాల‌వుతున్నార‌ని ఆమె మండి ప‌డ్డారు. వెంట‌నే ప్ర‌భుత్వం రైతుల‌ను అదుకోవాల‌ని అమె డిమాండ్ చేశారు.

దిశ‌కు వివ‌ర‌ణ ఇచ్చిన‌ రైతు బ‌త్తుల ఉమా..

8 ఏక‌రాల పంట సాగు చేశాం. 10 ట్రాక్ట‌ర్ల ధాన్యం వ‌చ్చింది. మొత్తం రాత్రి వ‌చ్చిన వ‌ర్షానికి కొట్టుకునిపోయింది. మిగిలింది మొత్తం త‌డిసిపోయింది. అప్పు చేసి సాగు చేశాం ఇప్పుడు అకాల వ‌ర్షం కార‌ణంగా సుమారు 3 ల‌క్ష‌ల న‌ష్టం వాటిల్లింది ప్ర‌భుత్వం అదుకోవాలి.

దిశ‌కు వివ‌ర‌ణ ఇచ్చిన రైతు ఈసం రాంమూర్తి..

6 ఏక‌రాల‌లో పంట సాగు చేశాను. సాగు త‌ర్వాత చేతికొచ్చిన‌ ధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రంకి త‌ర‌లించాను. ఉప్పోంగిన వర‌ద కార‌ణంగా తీర‌ని న‌ష్టం వాటిల్లింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్తితి ఉంది.



Next Story