హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అపరిశుభ్రత...

by Elthuri vijay kumar |

-ప్రధాన ద్వారం వద్ద పేరుకుపోయిన చెత్త

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అపరిశుభ్రత...
X

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అపరిశుభ్రత...

-ప్రధాన ద్వారం వద్ద పేరుకుపోయిన చెత్త

-చర్యలు తీసుకోని సిబ్బంది, అధికారులు

-ఇబ్బందిపడుతున్న రోగులు,

దిశ,హుజురాబాద్ రూరల్ : భారీ వర్షాల అనంతరం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం రోగులను, సందర్శకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తినుబండారాల ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు వంటి వ్యర్థాలు ఆసుపత్రి ఆవరణలో ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. ఉదయం నుంచి చెత్త పేరుకుపోయినప్పటికీ, దాన్ని తొలగించడానికి ఆసుపత్రి అధికారులు, సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జ్వరం, ఇతర అనారోగ్యాలతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఈ అపరిశుభ్ర వాతావరణం చూసి ఆవేదన చెందుతున్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సైతం ఈ చెత్తను పట్టించుకోకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆసుపత్రి నిర్వహణ ఎంత అద్వాన్నంగా ఉందో తెలియజేస్తోందని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి అపరిశుభ్రత వల్ల ప్రజల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story