పలు మండలాల్లో పర్యటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్

by Kodari Anjali |

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ శనివారం మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.

పలు మండలాల్లో పర్యటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్
X

దిశ, మేడిపల్లి/కథలాపూర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ శనివారం మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకి గత రెండు ప్రభుత్వాలు నెట్టేశాయని ఇలానే కొనసాగితే తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంక, పాకిస్తాన్ ల అవుతుందని అన్నారు. ప్రజలు తిండికి లేక అడుకునే పరిస్థితి ఎదురవుతుందని రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అలాగే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కింది నుంచి వచ్చిన నాయకుడని, అతను అంచేలాంచెలుగా ఎడిగాడని, రాజకీయల పరంగానే విమర్శలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు ఉండవని అన్నారు. రేవంత్ రెడ్డి నేటితో 20 సంవత్సరాల రాజకీయ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్బంగా బండి సంజయ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సర్(SIR) ప్రక్రియ అమలులో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, హిందువుల ఓట్లని తొలగించే కుట్రలు కూడా చేస్తుందని, ఇకనైనా హిందువులు మేలుకోకపోతే హిందువులు మైనారిటీలుగా అయ్యే ప్రమాదం ఉన్నదని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు...

ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక కరీంనగర్ - జగిత్యాల జాతీయ రహదారి టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యిందని త్వరలో పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో సంక్ష పథకాలకు కేంద్ర నిధులతోనే అభివృద్ధి జరుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చే పరిస్థితుల్లో లేదని,రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నారు. 14, 15 ఫైనాన్స్ నిధులు గ్రామాల అభివృద్ధికి కేంద్రంలో కేటాయిస్తే. గ్రామ కరెంటు బిల్లులు, వర్కర్ల జీతాలు వాటితో చెల్లెస్తున్నారు. ఇలా అయితే గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అనంతరం పలువురు నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించిచారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగం శివకుమార్, జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు, కరీంనగర్ పార్లమెంట్ కన్వినర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, కో కన్వినర్ క్యాతం ధశరత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరండ్ల మధుకర్, సర్పంచులు ఎనుగుల లచ్చయ్య, దుంపల నివేదిత మనోజ్ రెడ్డి, కోటగిరి గంగరాజు లింగం కిసాన్, మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వర్ రావు, కథలాపూర్ మండలాధ్యక్షులు మల్యాల మారుతి, ప్రధాన కార్యదర్శి నరెడ్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story