- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా జోలికొస్తే నీ బతుకు రోడ్డుకీడుస్తా’.. కేటీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి
కేంద్రం నిధులు పక్కదారి పట్టించింది కేటీఆర్..

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: కేంద్రం నిధులు పక్కదారి పట్టించింది కేటీఆర్.. కేంద్రం మున్సిపాలిటీలకు వరదల్లా నిధులిస్తే, ఆ నిధులను పక్కదారి పట్టించి కేటీఆర్ సిరిసిల్ల పట్టణాన్ని వరదల్లో మునిగేలా చేశాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో నిర్వహించిన పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఆయన పాల్గొని కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. కేటీఆర్ సిరిసిల్లను నాశనం చేశాడని, వర్షాకాలం వరదలు వస్తే సిరిసిల్లలో పలు కాలనీలతో పాటు మొన్న కట్టిన కలెక్టరేట్ కూడా నీట మునిగి, కలెక్టర్ ట్రాక్టర్‌లో రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి తనపై వేల కేసులు పెట్టించాడని, ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ నువ్వు చేసిన అరాచకాలు నీచ పనులన్నీ బయట పెడతానని, నా జోలికి వస్తే, నీ బతుకు రోడ్డుకీడుస్తానంటూ ధ్వజమెత్తారు.
రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయి..
సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ కంటే తనకే మెజారిటీ ఓట్లు వేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు 2 లక్షల 40 వేల మెజారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. నాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డా వేసి, ఓటుకు రూ.5 నుండి 10 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్‌లోనే సంసారం చేస్తున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ రాజకీయం వ్యభిచారం చేస్తుందని, అన్ని ఆధారాలున్నా స్పీకర్ కేసు కొట్టి వేయడం దారుణమన్నారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమౌతుందని, రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిపై మచ్చపడి చరిత్రహీనులు కావద్దని కోరారు. సిరిసిల్లలో వస్త్ర మొత్తం పరిశ్రమ ఉంటే, కేవలం కమిషన్ల కోసం నూలు డిపోను వేములవాడలో ఏర్పాటు చేశారన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లకు ఏ నిధులు ఇవ్వలేదని, నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.
సిరిసిల్లను అభివృద్ధి చేసి చూపిస్తా...
సిరిసిల్ల మున్సిపాలిటీలో బలవంతంగా ఏడు గ్రామాలను కలిపి అక్కడి ప్రజలకు ఉపాధి హామీ పని లేకుండా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు విలువైన గ్రామాలను గ్రామపంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తే వాటిని వృథా చేస్తున్నారని, కేంద్రం ఇచ్చిన నిధుల లిస్టును కేటీఆర్‌తో సహా అందరికీ పంపిస్థానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, ఓట్లు మీరు వేస్తే సిరిసిల్లను తాను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జే సంఘప్పతోపాటు, 39 వార్డుల అభ్యర్థులు, పార్టీ జిల్లా నేతలు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొన్నారు.






