అడవిలో చెట్లను నరికిన గుర్తు తెలియని వ్యక్తులు

by Kema Shiva Kumar |

అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికేసిన ఘటన మండల పరిధిలోని గండి వెంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం చోటుచేసుకుంది.

అడవిలో చెట్లను నరికిన గుర్తు తెలియని వ్యక్తులు
X

దిశ, రుద్రంగి : అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికేసిన ఘటన మండల పరిధిలోని గండి వెంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎకరం విస్తీర్ణంలో అటవీ చెట్లను మిషన్ సహాయంతో కొందరు దుండగులు నరికేశారు. ఓ వైపు ప్రభుత్వం హరితహారంలో చెట్లు నాటండి అని చెబుతుంటే కొందరు అక్రమార్కులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. వారి సొంత లాభం కోసం అటవీ సంపదను ధ్వంసం చేస్తున్నా.. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయను ఫోన్ ద్వారా వివరణ కోరగా అటవీ చెట్లను నరికిన విషయం తమ దృష్టికి వచ్చిందని, చెట్లను నరికింది ఎవరనే విషయంలో విచారణ చేస్తున్నామని అన్నారు. అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story