తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీ..

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీ..
X

దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం మేరకు.. మల్యాలకు చెందిన కలువాల సత్తమ్మ ఇంటికి తాళం వేసి.. తన కొడుకు దగ్గర కరీంనగర్ లోని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళేది. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో దాచిన రూ.25 వేల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫింగర్ ప్రింట్ సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story