- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ అదృశ్యం కేసు: సీఐ నాగరాజును ఆసుపత్రికి తరలించిన సిట్.. స్టేట్‌మెంట్‌పై ఉత్కంఠ
సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. బుధవారం (జీజీహెచ్) ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. నాగరాజును అజిత్‌సింగ్‌నగర్‌లో సిట్ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకువచ్చారన్న ఆరోపణలపై సిట్ ఆరా తీస్తోంది. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాత్ర, సీసీటీవీ ఫుటేజ్ మాయమైన అంశాలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
కృష్ణలంక పీఎస్, టాస్క్‌ఫోర్స్ కార్యాలయం, సీపీ ఆఫీస్, కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఫుటేజ్ గల్లంతుపై సాంకేతిక సమస్యల కారణమని వివరణ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కీలక ఆధారాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? అనే కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు ఇచ్చే స్టేట్‌మెంట్ కేసులో కీలకంగా మారనుంది.






