దిశ కథనానికి స్పందన.. నాణ్యత లోపాల రోడ్డుకు మరమ్మతులు ప్రారంభం

by Kodari Anjali |

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేసిన మేళ్లచెరువు–చింతిర్యాల డబుల్ బీటీ రోడ్డులో నాణ్యత లోపాలు బయటపడిన నేపథ్యంలో దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

దిశ కథనానికి స్పందన.. నాణ్యత లోపాల రోడ్డుకు మరమ్మతులు ప్రారంభం
X

దిశ, చింతలపాలెం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేసిన మేళ్లచెరువు–చింతిర్యాల డబుల్ బీటీ రోడ్డులో నాణ్యత లోపాలు బయటపడిన నేపథ్యంలో దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రోడ్డులో ఏర్పడిన దెబ్బతిన్న ప్రాంతాలపై దృష్టి సారించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీతారామయ్య, సంబంధిత కాంట్రాక్టర్‌ను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్ యంత్రాంగం 48 గంటల లోనే రంగంలోకి దిగి రోడ్డులో దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించే పనులు ప్రారంభించింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, నాణ్యతపై వ్యక్తమైన సందేహాల నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా రోడ్డు నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Next Story