ఘోరం..అత్త, బావ మరిది, స్నేహితుడిని కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

by Malleboina Mahesh |

పంజాబ్‌లో దారుణం.. ఘర్షణల నేపథ్యంలో అత్త, బావ మరిది, స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపి.. యువకుడు ఆత్మహత్య!

ఘోరం..అత్త, బావ మరిది, స్నేహితుడిని కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ యువకుడు తనతో తెచ్చుకున్న తుపాకితో అత్త, బావమరిది, స్నేహితుడిని కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ షాకింగ్ సంఘటన పంజాబ్‌ రాష్ట్రం గురుదాస్‌పూర్ జిల్లాలో బటాటా పరిధిలోని ముండి క‌లార్ గ్రామంలో మంగళవారం రాత్రి (జూన్ 23) చోటుచేసుకుంది. కాగా పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు మంజోత్ సింగ్ (35) మంగళవారం రాత్రి ఖాన్ ప్యారా గ్రామానికి చెందిన తన స్నేహితుడు, మాజీ సైనికుడు (Ex-serviceman) పర్గత్ సింగ్‌తో కలిసి ముండి క‌లార్ గ్రామంలో ఉంటున్న తన బాబాయ్ (చిన్నాన్న) నిషాన్ సింగ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏదో విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన మంజోత్ సింగ్.. తన వద్ద ఉన్న తుపాకీతో తన అత్త (బాబాయ్ భార్య), బావ మరిది (అత్త కొడుకు) పై కాల్పులు జరిపాడు.

ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మంజోత్ స్నేహితుడు, మాజీ సైనికుడు పర్గత్ సింగ్‌ను కూడా నిందితుడు దారుణంగా కాల్చి చంపాడు. ముగ్గురిని అక్కడికక్కడే హతమార్చిన అనంతరం, తీవ్ర భయాందోళనకు లోనైన మంజోత్ సింగ్.. అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బుధవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షలు లేదా ఆస్తి తగాదాల వల్లే ఈ ఘోరకలి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో సదరు గ్రామంలో తీవ్ర భయాందోళనలు, విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story