సీఐ నాగరాజుకు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-24 08:45:43  IST  )

నాగరాజు మిస్సింగ్ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనల పరిణామాలు చోటు చేసుకున్నాయి.....

సీఐ నాగరాజుకు రిమాండ్..  రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: నాగరాజు మిస్సింగ్ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ కేసు విషయంలో సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు నాగరాజు ఆచూకీ కోసం ఆరా తీశారు.

సీఐ నాగరాజు తీరుతో అనుమానాలు

అయితే సీఐ నాగరాజు దూషించడం, సాయికృష్ణ చచ్చాడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన కుమారుడి ఆచూకీపై తల్లి విజయలక్ష్మి కోర్టుకు వెళ్లారు. దీంతో సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా చర్చనీయాంశంమైంది. దీంతో సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు రాజకీయ దుమారం చెలరేగింది. సాయికృష్ణను పోలీసులు చంపేశారంటూ తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సాయికృష్ణ మిస్సింగ్‌పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

రంగంలోకి దిగిన సిట్.. బయటకు అసలు విషయం

సాయికృష్ణ మిస్సింగ్ నేపథ్యంలో విచారణ చేపట్టిన సిట్ అధికారులు కీలక విషయాలను గుర్తించింది. సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో మరణించినట్లు గుర్తించింది. విచారణలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌తో పాటు సాయికృష్ణను మార్కాంపురం తీసుకొచ్చిన సిబ్బందిని అధికారులు విచారించారు. ఈ విచారణలో సాయికృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చూశానని ఎస్సై వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని సీఐ నాగరాజు రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో ఆధారాలను కూడా మాయం చేశారని, ఇందుకు సీఐనే కారణమని పీఎస్ పోలీసులు తెలిపినట్లు పేర్కొంది. సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్‌లో లేకుండా చేశారని, డీవీఆర్‌లను ఎఫ్ఎస్ఎల్‌కు పంపామని రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. సాయికృష్ణ మరణించిన విషయం తెలిసినా మెజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వలేదని, సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే సీఐ నాగరాజు దూషించారని, హైకోర్టు ముందు నిజాలు దాచారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టించారని సిట్ అధికారులు వెల్లడించారు.


Next Story