- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానేరులో గుర్తు తెలియని శవం...!
మండేపల్లి గ్రామ శివారు మానేరు వాగులో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చినట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.

దిశ, తంగళ్ల పల్లి: మండేపల్లి గ్రామ శివారు మానేరు వాగులో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చినట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఆ మృతదేహం మగ వ్యక్తిది అని... వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మానేరు వాగు వద్ద గంగాధర కిషన్ వ్యవసాయ పొలం వద్ద మృతదేహం ఉన్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి మూదం ప్రశాంత్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చారని ఎస్ఐ వివరించారు.
కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మానేరు వాగు వద్ద మృతదేహానికి పంచనామా నిర్వహించామన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అక్కడే ఖననం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సుమారుగా నెల రోజుల ముందు చనిపోయినట్లు భావిస్తున్నామని, మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉందని వివరించారు. మృతదేహం గుర్తు పట్టే పరిస్థితి లేదన్నారు. ఆచూకీ తెలిసినవాళ్లు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని స్పష్టం చేశారు.






