యువతి తల్లిదండ్రుల వేధింపులు తాళలేక.. ఓ యువకుడు ఆత్మ హత్య

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-11 17:16:24  IST  )

ప్రేమించిన యువతి తల్లి దండ్రులతో పాటు పోలీస్ ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం మంథనిలో వెలుగులో కి వచ్చింది.

యువతి తల్లిదండ్రుల వేధింపులు తాళలేక.. ఓ యువకుడు ఆత్మ హత్య
X

దిశ, మంథని : ప్రేమించిన యువతి తల్లిదండ్రులతో పాటు పోలీస్ ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం మంథనిలో వెలుగులోకి వచ్చింది. మృతిని తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ కి చెందిన ఓ కౌన్సిలర్ కుమార్తె, పెరుగు సతీష్ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేయకుండా అవమానించి ఓ పోలీస్ అధికారి ద్వారా బెదిరించడంతో తన కొడుకు మన స్థాపం చెంది గత నెల ఫిబ్రవరి 15 న గడ్డి మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడి చికిత్స పొందుతూ చ‌నిపోయాడు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేయాలనీ మృతుని తల్లి హెచ్ఆర్సిలో పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన మంథని పట్టణంలో చర్చనియంశంగా మారింది. ఇదే విషయంపై పోలీస్ అధికారిని దిశ రిపోర్టర్ వివరణ కొరగా తనకు ఎలాంటి సంబందం లేదని తెలిపారు.

Next Story