రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

by velandi.Saikiran |

మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన మూల ఆంజనేయులు (60) వ్యక్తి గత పని మీద స్వగ్రామం కరీంపేట నుంచి కేశవ పట్నం

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
X

దిశ, శంకరపట్నం : మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన మూల ఆంజనేయులు (60) వ్యక్తి గత పని మీద స్వగ్రామం కరీంపేట నుంచి కేశవ పట్నం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్లాడాఉ. ఆ స‌మ‌యంలో కేశవ పట్నం ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టాడు. ఈ ప్ర‌మాదంలో ఆంజనేయులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ త‌రుణంలోనే 108 సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి పైలెట్ కాజా ఖలీల్ ఉల్లా సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఢీ కొట్టిన మరో ద్విచక్ర వాహనం వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story