- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం దొంగిలించిన ఇద్దరు దొంగలు అరెస్ట్
బంగారం దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, కరీంనగర్ రూరల్ : బంగారం దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా నేరాలకు పాల్పడుతున్న బొమ్మకల్, చింతకుంటకు చెందిన ఎం.డీ మహ్మద్, మహ్మద్ మొయిన్ కలసి జల్సాలకు అలవాటు పడి గత సంవత్సరం చొప్పదండిలో ఓ ఇంట్లో బంగారం చోరీతో పాటు ఇటీవల విజయనగర్ కాలనీ, సిటిజన్ కాలనీ, బొమ్మకల్ ప్రాంతాల్లో పలు ఇళ్లలో బంగారం, ఆభరణాలను దొంగతనాలకు పాల్పడ్డారు అని సీఐ తెలిపారు.
కొంత బంగారం కరీంనగర్ లో అమ్మినట్లు గుర్తించారు పోలీసులు.మరో కొంత బంగారం నందేడు లో అమ్మేందుకు సిద్ధమై దొంగతనానికి పాల్పడిన ఆటోతో తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించినట్లు సీఐ తెలిపారు. వారి నుంచి ఏడు తులాల మూడు గ్రాముల బంగారం, తొంభై గ్రాముల వెండితోపాటు రెండు సెల్ ఫోన్లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ చేసినట్లు సీఐ అన్నారు. కేసును త్వరితగతిన ఛేదించడంతో రూరల్ పోలీసులను అభినందించారు ఏసీపీ విజన్ కుమార్.






