మర్కాపూర్ బస్సు ప్రమాదంలో ఇద్దరు జగిత్యాల జిల్లా వాసులు మృతి

by Ratna Kumari |   (  Updated:2026-03-26 15:48:21  IST  )

జగిత్యాల నుంచి హైదరాబాద్ మీదుగా ఏపీలోని ప్రకాశం జిల్లా పామూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది.

మర్కాపూర్ బస్సు ప్రమాదంలో ఇద్దరు జగిత్యాల జిల్లా వాసులు మృతి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల నుంచి హైదరాబాద్ మీదుగా ఏపీలోని ప్రకాశం జిల్లా పామూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోని మృతుల్లో ఇద్దరు జగిత్యాల జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు గా పని చేస్తూ ఇక్కడే నివాసం ఉంటున్న వారు ఉన్నారు. నెల్లురు జిల్లా కు చెందిన వలస కూలీలైన నర్సపురం సత్తమ్మ, డప్పుల కిరణ్, ముత్తంగి వెంకటేశ్వర్లు జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో నివసిస్తున్నారు. రాయికల్ మండలం రామరావుపల్లి గ్రామంలో ఉప్పు రమ, భర్త మాల్యద్రి వీరి కొడుకు మనోహర్, జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో రేగుల గడ్డ మనోహర్, మేడిపల్లి మండలం తొంబారావుపేట గ్రామంలో ప్రభావతి ఆమె భర్త శ్రీనివాస్ ఆరేళ్ల పాప చైత్ర తో కలిసి ఉన్నారు.

ఏపీ కి చెందిన వీరంతా జిల్లాలో పలు చోట్ల భవన నిర్మాణ కూలీలుగా, మేస్త్రీలుగా పని చేస్తున్నారు. వీరిలో మాల్యద్రి, ప్రభావతి భర్త శ్రీనివాస్ మినహా మిగిలిన వారందరూ ఏపీలోని సొంతూరైన పాలమూరుకు వెళ్లేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు లో ప్రయానమ‌య్యారు. మార్గమధ్యంలో ఏపీ లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన లో జిల్లా వాసులు ఉప్పు రమ, ముత్తంగి వెంకటేశ్వర్లు మృతి చెందారు. అలాగే ఆరేళ్ల పాప చైత్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో ఉప్పు కిరణ్, తుపాకుల రత్నమ్మలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story