- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో స్నానానికి వెళ్లి.. ఇద్దరు కూలీల మృతి
చెరువులో ఇద్దరు కూలీలు గల్లంతైన సంఘటన మండల పరిధిలోని పాపయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గల్లంతైన కూలీల కోసం అధికారులు, ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

దిశ, తంగళ్లపల్లి : రైల్వే లైన్ పనుల కోసం వలస వచ్చిన ఇద్దరు కూలీలు చెరువులో స్నానానికి వెళ్లి గల్లంతై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తంగళ్ళపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తంగళ్ళపల్లి మండలంలో కొత్తగా రైల్వే పనులు చేయడానికి ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సడక్ గూడకు చెందిన మోతివాడ్ నాగార్జున (22), పల్నాడు జిల్లా గోగులపాడుకు చెందిన ముండ్ర రత్తయ్య (25) లు వచ్చారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో పాపయ్యపల్లి గ్రామంలోని మాయపెల్లి చెరువులో ఇద్దరు స్నానం కోసం వెళ్లారు. అయితే చెరువులోకి దిగిన కూలీలు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గల్లంతయిన కూలీల కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు చెరువులో గాలించగా, చివరకు ఇరువురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇతరకపోవడం వల్లే ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుని బంధువు మూతి వాడ్ హరిదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ ఉపేంద్ర చారి తెలిపారు.






