- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒక్కరు ఆంజనేయ మాలధారి
మండలంలోని ఇస్లాంపూర్ సమీపంలో నిన్న రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, గంగాధర : మండలంలోని ఇస్లాంపూర్ సమీపంలో నిన్న రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆంజనేయ స్వామి మాల వేసుకొని కాలినడకన కొండగట్టు బయలుదేరిన కొండి శ్రీనివాస్ అనే భక్తుడు, ఇస్లాంపూర్ వద్ద రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడని శిక్షణ ఎస్ఐ స్వాతి తెలిపారు. ఎస్సై స్వాతి తెలిపిన వివరాల ప్రకారం అదే రూట్‌లో పూడూరు వైపు బైక్‌పై వెళ్తున్న గౌరారంకు చెందిన ఇద్దరు యువకులు కాసాని గణేష్, కాసాని రాజు వేగంగా వస్తూ మాలధారి శ్రీనివాస్‌ను ఢీకొట్టగా మాలధారి కొండి శ్రీనివాస్, బైక్ రైడర్ కాసాని గణేష్ తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో ఇద్దరూ మృతి చెందారని, మరో యువకుడు కాసాని రాజు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శిక్షణ ఎస్ఐ స్వాతి తెలిపారు.
Next Story






