ఇద్దరు ఎక్సైజ్ శాఖ అధికారుల సస్పెన్షన్

by Naveena |

జిల్లాలో ఇద్దరు ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం సస్పెండ్ అయ్యారు

ఇద్దరు ఎక్సైజ్ శాఖ అధికారుల సస్పెన్షన్
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో ఇద్దరు ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం సస్పెండ్ అయ్యారు. జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎస్. పంచాక్షరీని సస్పెండ్ చేస్తూ.. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎఎం రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎక్సైజ్ శాఖ సిరిసిల్ల ఇన్స్పెక్టర్ గులాం ముస్తాఫా ను సస్పెండ్ చేస్తూ..వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని చిత్ర బార్ కి ట్రేడ్ లైసెన్స్ లేకుండానే 2బి లైసెన్స్ రినివల్ చేసి.. తప్పుడు నివేదికలు సమర్పించినందుకు, క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చిత్రబార్ విషయంలో ఇద్దరు సస్పెండ్ కావడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.

Next Story