గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్టు

by Ratna Kumari |   (  Updated:2026-04-04 16:18:39  IST  )

గంజాయి అమ్ముతున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్ అయిన ఘ‌ట‌న జ‌గిత్యాల టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

గంజాయి అమ్ముతున్న ఇద్దరు  అరెస్టు
X

దిశ, జగిత్యాల టౌన్ : గంజాయి అమ్ముతున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్ అయిన ఘ‌ట‌న జ‌గిత్యాల టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ క‌రుణాక‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్ లోనీ నాగేంద్ర నగర్ ఏరియాలో మధ్యాహ్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ నిషేధిత గంజాయి అమ్ముతున్నారని సమాచారం మేరకు పట్టణ ఎస్సై సుప్రియ తన సిబ్బందితో కలిసి ఆ వ్యక్తులను పట్టుకొని తనిఖీ చేసి విచారించింది. దీంతో వారు కొత్తూరి అనిల్, దర్శనాల అభిలాష్ లు కప్పర్ల గ్రామం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్దనుంచి 250 గ్రాముల గంజాయిని సీజ్ చేయడంతోపాటు అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ కరుణాకర్ తెలిపారు.

Next Story