- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. ఇద్దరు అరెస్ట్
జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని తులసి నగర్‌కు చెందిన సమీండ్ల రాజేష్, సమీన్ల గంగరాజులు తమ తాతగారి పేరు పై ఉన్న ఆస్తికి పార్టిషన్ డీడ్(విభజన పత్రం) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. ఈ క్రమంలో విద్యానగర్‌కు చెందిన డాక్యుమెంట్ రైటర్ దిండిగల శ్రీనివాస్ సహకారంతో మున్సిపల్ అసెస్‌మెంట్ సర్టిఫికేట్‌పై జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈనెల 8వ తేదీన మున్సిపల్ కమిషనర్ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్‌ఐ సదాకర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులు సమీండ్ల రాజేష్, డాక్యుమెంట్ రైటర్ దిండిగల శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా, పంచుల సమక్షంలో జరిపిన ఈ విచారణలో తాము నేరానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సామిండ్ల గంగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించినట్లు టౌన్ సీఐ కరుణాకర్ స్పష్టం చేశారు.






