- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ దగ్ధం
by velandi.Saikiran |
టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ దగ్ధం చేసిన సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని కేసీఆర్ నగర్ లో చోటు చేసుకుంది.

X
దిశ, ఎల్లారెడ్డిపేట : టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ దగ్ధం చేసిన సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని కేసీఆర్ నగర్ లో చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గురువారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీని ఎల్లారెడ్డిపేట కు చెందిన అంగూరి ప్రభాకర్, హాబీబ్ లు చింపి, కాల్చి వేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మండల టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కదిరే భాస్కర్ గౌడ్. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story






