- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాంగ్ రూట్‌లో కాలేజ్ బస్ ఢీ.. తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్, గ్రామస్తుల ఆందోళన
జిల్లాలోని వెలిచాల గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ట్రినిటి కాలేజ్‌కు చెందిన ఓ బస్సు రాంగ్ రూట్‌లో వెళ్లి ఆటోను ఢీకొట్టగా, ఆటోను నడుపుతున్న వీర్ల రాంచందర్ రావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

దిశ, రామడుగు : జిల్లాలోని వెలిచాల గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ట్రినిటి కాలేజ్‌కు చెందిన ఓ బస్సు రాంగ్ రూట్‌లో వెళ్లి ఆటోను ఢీకొట్టగా, ఆటోను నడుపుతున్న వీర్ల రాంచందర్ రావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కాలేజ్ బస్సు యాజమాన్యం బాధితుడికి సహాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, గ్రామస్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ప్రమాదం అనంతరం హామీ.. ఆపై నిర్లక్ష్యం
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ బాధితుడికి చికిత్స అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అనంతరం కాలేజ్ యాజమాన్యం బాధితుని ఆరోగ్యంపై పట్టించుకోకుండా చేతులు దులిపేసింది. ఈ తీరుతో న్యాయం కోసం గ్రామస్తులు బస్సును అడ్డుకొని నిరసన చేపట్టారు. ఆటో డ్రైవర్ల సంఘం కూడా గ్రామస్థులకు మద్దతుగా నిలిచింది.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి.. పోలీసుల జోక్యం
ఈరోజు ఉదయం కాలేజ్ విద్యార్థులను తీసుకెళ్లేందుకు బస్సు గ్రామానికి వచ్చిన సమయంలో గ్రామస్తులు దాన్ని అడ్డుకుని, బస్సు కదలకుండా నిరసన తెలిపారు. "బాధితుడికి న్యాయం జరిగే వరకు బస్సు గ్రామం నుంచి బయలుదేరదు" అని వారు స్పష్టం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భద్రత చర్యలు ముమ్మరం చేశారు.
యాజమాన్యంపై మానవతా విలువల ప్రశ్న
ప్రమాదానికి కారణమైన ట్రినిటి కాలేజ్ బస్సు వ్యవహారంలో, మానవత్వాన్ని పక్కన పెట్టిన యాజమాన్యం తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడికి తగిన పరిహారం ఇవ్వాలని, బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై అధికారుల స్ధాయిలో విచారణ ప్రారంభమవుతుందా? బాధితుడికి న్యాయం జరిగే వరకు గ్రామస్థుల పోరాటం కొనసాగుతుందా అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.






