- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మై ఆటో ఈజ్ సేఫ్' తో ప్రయాణం సురక్షితం..
మై ఆటో ఇజ్ సేఫ్ తో ప్రయాణం సురక్షితమని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు

దిశ,కోరుట్ల టౌన్ : మై ఆటో ఇజ్ సేఫ్ తో ప్రయాణం సురక్షితమని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా..కోరుట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మై ఆటో ఇజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ఆటో ఇజ్ సేఫ్ అనే కార్యక్రమంతో మహిళలు, పిల్లలు ఎవరైనా సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకోవచ్చన్నారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన యాప్ ను ఆటో వాహనంలో ఏర్పాటు చేసినట్లు, ఆటోల్లో ప్రయాణించిన సమయంలో ఏదైనా విలువైన సామాగ్రిని మరచిపోయినట్లతే, వాటిని సులభంగ తిరిగి పొందవచ్చునన్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా తాము ప్రయాణించిన ఆటో వాహనం సమాచారం ఆయా ఆటోలో ఏర్పాటు చేసిన యాప్ స్టికర్ ద్వారా తెలుసుకోవచ్చునని సూచించారు. ఇందుకోసం పట్టణంలో ఉన్న ఆటో వాహనాలను క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ చేసి పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాములు, సిఐ సురేష్, ఎస్సై లు శ్రీకాంత్, నవీన్ కుమార్, శ్యామ్ రాజ్, రాంచంద్రం సిబ్బంది పాల్గొన్నారు.






