- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. రెండు కుటుంబాలలో విషాదం..
by Batti.Sumithra |
మండలంలోని దమ్మయపేట స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.

X
దిశ, కొడిమ్యాల : మండలంలోని దమ్మయపేట స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిర్మలపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన సంద్రాలపల్లె గ్రామానికి చెందిన పెంకసుల అక్షయ్ (19), పిట్టల రాజేందర్ (18) దమ్మయ పేట గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో అక్షయ్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేందర్ చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. ఇరువురు యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలంలో యువకుల కుటుంబ సభ్యులు, మిత్రుల రోదన పలువురిని కలిచి వెస్తుంది. ఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






