పండుగ వేళ విషాదం.. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

హైద‌రాబాద్ లో సిరిసిల్ల‌కు చెందిన విద్యార్థిని బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్ప‌డింది. ఆ విద్యార్థిని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండ‌లం స‌నుగుల గ్రామానికి చెందిన నందినిగా గుర్తించారు.

పండుగ వేళ విషాదం.. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : హైద‌రాబాద్ లో సిరిసిల్ల‌కు చెందిన విద్యార్థిని బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్ప‌డింది. ఆ విద్యార్థిని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండ‌లం స‌నుగుల గ్రామానికి చెందిన నందినిగా గుర్తించారు. హైదరాబాద్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో నందిని బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గురువారం నారపల్లిలోని ప్రైవేట్ హాస్టల్ గదిలో నందిని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నందిని ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించనున్నారు.

Next Story