- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ జయంతి..నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు చోటు చేసుకోనున్నాయి.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. జగిత్యాల మార్గం నుండి కరీంనగర్ పట్టణానికి వచ్చే భారీ వాహనాలను రేకుర్తి వద్ద మళ్లించనున్నారు.
ఇవి రేకుర్తి నుండి శాతవాహన యూనివర్సిటీ, పద్మనగర్ మీదుగా రాంనగర్, తెలంగాణ చౌరస్తా చేరుకుని, అక్కడ నుండి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. గోదావరిఖని మార్గం నుంచి వచ్చే భారీ వాహనాలను బొమ్మకల్ బైపాస్ వద్ద మళ్లించి, బొమ్మకల్ నుండి బద్దం ఎల్లారెడ్డి చౌరస్తా, కమాన్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉండనుంది. అంబేద్కర్ జయంతి వేడుకల నేపథ్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లలో జనం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వాహనదారులు పోలీసులకు సహకరించి సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.






