రాఘవపేట్ లో ట్రాక్టర్ బోల్తా..వ్యక్తి మృతి, చిన్నారికి గాయాలు

by Bhanu |

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

రాఘవపేట్ లో ట్రాక్టర్ బోల్తా..వ్యక్తి మృతి, చిన్నారికి గాయాలు
X

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవపేట్ గ్రామానికి చెందిన చేదలి ప్రవీణ్(32) తన కుమారుడు శ్రీహాన్‌తో కలిసి వ్యవసాయ తోటకు పని నిమిత్తం ట్రాక్టర్‌పై వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇంటికి ప్రయాణం అవ్వగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి శ్రీహాన్ కు తీవ్ర గాయాలు అవ్వగా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Next Story