అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-14 16:18:29  IST  )

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు సీజ్ చేసినట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

అక్రమంగా ఇసుక  తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
X

దిశ, కరీంనగర్ రూరల్ : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి సీజ్ చేసినట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ మండలం పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నగునూర్ గ్రామానికి చెందిన బోదాసు అచ్యుత్ , బొమ్మకల్ కు చెందిన నేరెళ్ల శ్రీనివాస్, దుర్శెడ్ కు చెందిన శ్రామోజు తిరుపతి ట్రాక్టర్స్ పట్టుకొని వీరిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్స్ సీజ్ చేసి తదుపరి చర్యలకై కోర్టుకు పంపించినట్లు సీఐ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

Next Story