అభివృద్ధి వైపే.. మంథని పట్టణ ప్రజలు

by Ratna Kumari |

మంథని పట్టణ ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నట్లు మున్సిపల్ ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలే స్పష్టం అయ్యాయి.

అభివృద్ధి వైపే.. మంథని పట్టణ ప్రజలు
X

దిశ, మంథని : మంథని పట్టణ ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నట్లు మున్సిపల్ ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలే స్పష్టం అయ్యాయి. అందులో మంథని మున్సిపాలిటీలో 13 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. దీంతో మంథని మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలో మంథని కేంద్రంగా ఉన్న మంథని మున్సిపల్ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ లు గెలుపొందారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శ్రీధర్ బాబు ఓ పక్క... రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మరో పక్కా.. మంథని నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మంథని పట్టణ అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశారు. ఓ వైపు మంత్రి శ్రీధర్ బాబు తనకు ఇన్ చార్జిగా ఇచ్చిన జిల్లాలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే.. మంథని మున్సిపాలిటీ లో కుడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీధర్ బాబు సోదరుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు తనదైన శైలిలో మంథని మున్సిపాలిటీ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రీను బాబు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కీలకం అయ్యాడు. ప్రభుత్వ పని తీరు మంత్రి శ్రీధర్ బాబు రెండేళ్ల పాలన.. మంథని అభివృద్ధిని చూసి మంథని పట్టణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినట్టు స్పష్టంగా కనబడుతుందని రాజకీయ వర్గాల నుండి ప్రశంస కూడా వినబడుతున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించిన జిల్లాలో అన్ని చోట్ల మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కీలకం కావడంతో పాటు ప్రచారం నిర్వహించిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ చైర్మన్, మేయర్ స్థానాలను కైవసం చేసుకొవడం మరో విశేషం.

Next Story