- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొబ్బరికాయల నుంచి ప్రసాదాల వరకు… జాతర టెండర్లు నేడే
శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి పూజ సామాగ్రి విక్రయాలు, ఇతర సేవల హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని రంగనాయకుల గుట్ట వద్ద ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి పూజ సామాగ్రి విక్రయాలు, ఇతర సేవల హక్కుల కోసం మంగళవారం (నేడు) బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జాతరలో వివిధ సేవల నిర్వహణ కోసం ఈ టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
కొబ్బరికాయలు, బెల్లం అమ్మకాలు, గద్దెల వద్ద బెల్లం (బంగారం) పోగు చేసుకోవడం, ప్రసాదాల విక్రయం, తలనీలాలు సేకరించడం, తల్లి ఆరాధన కోళ్లు, కొబ్బరి ముక్కల సేకరణ కోసం టెండర్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు మంగళవారం ఉదయం 10 గంటల నుండి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఒక్కో వేలానికి రూ. 30,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, గతంలో బాకీ ఉన్న వారు ఈ వేలంలో పాల్గొనడానికి వీలు లేదన్నారు. వేలం పాటలో తగినంత సొమ్ము రాకపోయినా లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల వేలం పాటను రద్దు చేసే పూర్తి అధికారం అధికారులకు ఉంటుందని వారు స్పష్టం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా, జాతరను విజయవంతం చేసేందుకు వ్యాపారులు, ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొనాలని అధికారులు కోరారు.






