- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలివిడత ఓట్ల పండుగ.. పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామగ్రి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

దిశ, బ్యూరో కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ సామగ్రిని గ్రామాల వారిగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఎన్నికల నియమావళి, వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు అనంతరం ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అప్పగించి పోలీంగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కవాతులు నిర్వహించి ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేల అవగాహన కలిగించిన పోలీసులు అధికారులు సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు
సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 11,2025న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ (సీపీ) శ్రీ గౌస్ ఆలం తెలిపారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం, ఆయన ఎన్నికల బందోబస్తు ప్రణాళిక వివరాలను వెల్లడించారు.
మొదటి విడత మండలాలు (5): గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్.
గ్రామ పంచాయతీలు: 92
మొత్తం పోలింగ్ కేంద్రాలు: 866
సున్నిత/సమస్యాత్మక కేంద్రాలు
గత సంఘటనల ఆధారంగా గుర్తించిన సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు, వెబ్ కాస్టింగ్ లేదా మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్నారు.
బలగాల మోహరింపు
ప్రతి పోలింగ్ స్టేషన్‌లో స్టాటిక్ పోలీసు పార్టీ, మరియు ప్రతి మార్గంలో (రూట్) రూట్ మొబైల్ పార్టీ ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్
ఎన్నికలు జరిగే ప్రతి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించి, వారి అధీనంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను కేటాయించారు. ఈ ఫోర్స్‌లో స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు పూర్తి స్థాయి రైట్ గేర్‌తో సిద్ధంగా ఉంటారు.
నిషేధాజ్ఞలు
శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలను విధిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలింగ్ కేంద్రం నిబంధనలు
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపుల గుమికూడింపులు పూర్తిగా నిషేధం. పోలింగ్ స్టేషన్‌లో మొబైల్ ఫోన్లు మరియు ప్రచార సామగ్రి అనుమతించబడవని పేర్కొన్నారు.
పోలీస్ సిబ్బంది కేటాయింపు
మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 782 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో 06 గురు ఏసీపీలు, 19 ఇన్స్పెక్టర్లు , 40 ఎస్సైలు, 34 హెడ్ కానిస్టేబుల్స్, 392 కానిస్టేబుళ్లు, 47 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 144 హోంగార్డ్స్ మరియు 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులు ఉన్నారు.
కమ్యూనికేషన్ అండ్నిఘా
సమాచారం వేగంగా చేరవేసేందుకు 5 మండలాల్లో అదనంగా రిపీటర్, బేస్ సెట్లను ఏర్పాటు చేసి, వైర్ లెస్ కమ్యూనికేషన్‌ను పూర్తి సంసిద్ధంగా ఉంచారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను రిసీవింగ్ సెంటర్లకు తరలించే ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతల మధ్య, పోలీసుల నిరంతర నిఘాలో జరుగుతుందని సీపీ వివరించారు.
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం
ఎన్నికల అనంతరం అదేరోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సీపీ స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కొతపల్లి, కరీంనగర్ రూరల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన
మొదటి విడతలో గురువారం నిర్వహించునున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరగనున్న కరీంనగర్ రూరల్ మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొత్తపల్లి మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎలగందల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్ ను, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Read More..
పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. కొర్లపహాడ్‌లో కాంగ్రెస్, BRS శ్రేణుల తోపులాట






