- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికే టికెట్లు
దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి కనకరాజు, బీఆర్ఎస్ ఎనగందుల

దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి కనకరాజు, బీఆర్ఎస్ ఎనగందుల నరసింహులు, బీజేపీ తిరుపతి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చి మాలలకు మాత్రం మొండి చేయి చూపించారు. మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడంతో మాల సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థిని పోటీలోకి దింపి తమ బలమెంటో చూపిస్తామని మాలలు తీర్మానిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు తమ వాడలోకి ఓట్ల కోసం వస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు తమను ఓట్ల కోసమే వాడుకొని సీట్ల కాడ మాత్రం తమకు దక్కనివ్వడం లేదని వివిధ పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నారు. మాలలకు వివిధ పార్టీలు మొండి చేయి చూపించడంతో తమ సత్తా ఏంటో చూపిస్తామని మాలలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చర్చించుకుంటున్నారు.






