- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి నియామక పత్రాలు అందజేత
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి నియామక పత్రాలు అందజేశారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ తెలంగాణ ఆనంద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ సలహాదారుడు మల్లేశం పటేల్.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి నియామక పత్రాలు అందజేశారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ తెలంగాణ ఆనంద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ సలహాదారుడు మల్లేశం పటేల్. ఆదివారం జ్యోతిరావు పూలే మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన వారికి నియామక పత్రాలు అందజేశారు. నూతన పదోన్నతి నియామక పత్రం స్వీకరించిన సభ్యులు చిగుర్ల శ్రీనివాస్, చింతల భగత్ కుమార్, మొహమ్మద్ అంజద్, అనువాస నితిన్ కుమార్ ఉన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల ఫోరం చేపట్టబోయే ఏ పోరాటాలలోనైనా చురుకుగా పాల్గొంటామని.. ముఖ్యమైన పాత్ర వహిస్తామని, తెలంగాణ అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం పోరాడుతామని తెలియజేశారు. అలాగే నియామక పత్రాలు అందించిన తెలంగాణ ఆనంద్, ఆది మల్లేశం పటేల్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.






