స్ట్రాంగ్ రూమ్ ఘటన పై పూర్తి విచారణ జరగాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

హుజురాబాద్ కౌంటింగ్ కేంద్రంలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యం పై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. శ‌

స్ట్రాంగ్ రూమ్ ఘటన పై పూర్తి విచారణ జరగాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ‌, హుజూరాబాద్ : హుజురాబాద్ కౌంటింగ్ కేంద్రంలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యం పై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. శ‌నివారం హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే కాంగ్రెస్ నాయకులు “మాకు ఇన్ని సీట్లు వస్తాయి” అని ముందుగానే ప్రకటించడం యాదృచ్ఛికం కాదనీ, ఎవరికెంత సీట్లు వస్తాయో ముందే చెప్పడం అంటే ఇది సాధారణ రాజకీయ అంచనా కాదు అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టే అనిపిస్తోందనీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ముందుగా చెప్పిన స్థానాలే చివరికి వారికి అనుకూలంగా రావడం, ఇది ప్రజల్లో అనుమానాలు పెంచుతోందనీ, స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టడం, సీసీ కెమెరా ఫుటేజ్ తొలగించడం వంటి ఘటనలతో కలిపి చూస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియపై సందేహాలు మరింత బలపడుతున్నాయనీ అన్నారు.


ఒక్క రోజులోనే తాళాలు పోయినవి అని ప్రచారం చేయడం వెనుక అధికారుల పని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని, ఒక్క పూట స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి ని కాపాడలేని అధికారులు ఉన్న తరుణంలో అందులో ఉన్న పోలింగ్ బాక్సులు భద్రంగా ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయనీ అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ ఈ సంఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల హుజరాబాద్ ఎమ్మెల్యే గా నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. పోలీస్ అధికారులు, ఎన్నికల యంత్రాంగం ఎవరి కోసం పనిచేస్తోంది? ప్రజల కోసమా లేదా ఒక పార్టీ కోసమా?అని ప్రశ్నించారు. ఎన్నికలు అంటే ప్రజల తీర్పుఅని, ఆ తీర్పును ఎవరైనా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు. ఈ మొత్తం ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలనీ, స్ట్రాంగ్ రూమ్ ఘటనపై పూర్తి సీసీటీవీ డేటా రికవరీ చేయాలి అని అన్నారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని, అవసరమైతే ఈ ఎన్నికల ప్రక్రియపై పునర్విచారణ చేయాలని, హుజురాబాద్ ప్రజల హక్కుల కోసం నేను ఎప్పుడూ పోరాడుతాననీ, ప్రజల ఓటును ఎవరైనా దొంగిలించే ప్రయత్నం చేస్తే వారిని ప్రజల ముందుకు తీసుకొచ్చే వరకు త‌గ్గేదే లేద‌న్నారు కౌశిక్ రెడ్డి.

Next Story