- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్యనా.. ఆత్మహత్యనా
బావిలో పడి యువకుడు చనిపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తుంది.

X
దిశ, మానకొండూరు : బావిలో పడి యువకుడు చనిపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని రంగంపేట గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన యువకుడి మృతదేహం లభ్యం అయింది. కాగా బావిలో శవమై కనిపించిన యువకుడిది ఆత్మహత్యనా, హత్యనా అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. యువకుడి మరణంపై పలు అనుమానాలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బావిలో నుంచి యువకుడి డెడ్ బాడీని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






