- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిర్సపల్లిలో చోరీ.. మేడారం వెళ్లిన కుటుంబం
తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లిన ఘటన హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, హుజురాబాద్ రూరల్ : తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లిన ఘటన హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడవెల్లి భాగ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు వెళ్లారు. జాతర ముగించుకుని గురువారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి చేరుకోగా.. ఇంటి గేట్ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు తులంన్నర బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు మరియు రూ. 10,000 నగదు మాయమైనట్లు బాధితులు గుర్తించి లబోదిబోమన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






