- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్యా? ఆత్మహత్యా? యువతి అనుమానాస్పద మృతి
by Sathputhe Rajesh |
దిశ, రామడుగు: గ్రామ శివారులో గుర్తు తెలియని యువతి చెట్టుకు ఉరి వేసుకుని

X
దిశ, రామడుగు: గ్రామ శివారులో గుర్తు తెలియని యువతి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయిన సంఘటన ఆ గ్రామస్తులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ సంఘటన రామడుగు మండలంలోని దేశ రాజుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో గల చెరువు కట్ట కింద ఉన్న చెట్టుకు గుర్తు తెలియని యువతి ఉరి వేసుకొని చనిపోయిందని, చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూస్తే మూడు రోజులు పైబడే అక్కడ వేలాడుతుందని స్థానికులు చెబుతున్నారు.ఒక గుర్తు తెలియని మహిళ చెరువు కట్ట వద్దకు వచ్చి ఉరి వేసుకొని చనిపోవాల్సిన పని ఏమున్నదనేది స్థానికులకు అంతు చిక్కకుండా పోతోంది. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు దుర్వాసనను చూసి పోలీసులకు తెలిపారు. హత్య లేక ఆత్మహత్య అని తేల్చే పనిలో ఉన్నారు.
Next Story






